నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలపై చర్యలు

నిబంధనలు ఉల్లంఘించిన మెడికల్ దుకాణాలపై చర్యలు

వారం రోజులపాటు లైసెన్స్ సస్పెండ్
జిల్లా ఔషద తనిఖీ అధికారి ఏలే బాలకృష్ణ

జనగామ అర్బన్, ఆంధ్రప్రభ : జిల్లావ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన ఏడు మందుల షాపులకు వారం రోజులపాటు లైసెన్స్ సస్పెండ్ చేసినట్లు జిల్లా ఔషధ తనిఖీ అధికారి ఏళ్ల బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత వారం జిల్లా వ్యాప్తంగా పలు మెడికల్ దుకాణాలపై తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల ద్వారా మత్తు మరియు అలవాటు కలిగించు మందుల టెస్ట్ పర్చేసింగ్ చేసి ఔషద చట్టం నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై తగు చర్యల నిమిత్తం నివేదికలు సహాయ సంచాలకులు, ఔషద నియంత్రణ శాఖ, వరంగల్ వారికి పంపగా వారు నోటీసులు ఇచ్చి తగు విచారణ చేసి అట్టి నిబంధనలు ఉల్లంఘించిన మందుల దుకాణాల డ్రగ్ లైసెన్స్ లను సస్పెండ్ చేయడం జరిగింది అని తెలిపారు.

లైసెన్స్ సస్పెండ్ అయిన మందుల దుకాణముల వివరాలు ఇలా ఉన్నాయి… రఘునాథ్ పల్లి మండలం కేంద్రానికి చెందిన ఆక్సిజన్ మెడికల్ స్టోర్స్ కు7 రోజులు,సాయి తేజ మెడికల్ స్టోర్ కు7 రోజులు ,వాసవి మెడికల్ స్టోర్ కు7 రోజులు ,జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఏ టు జెడ్ మెడికల్ స్టోర్ కు7 రోజులు, సుమనా మెడికల్ స్టోర్ కు7 రోజులు, శ్రీ మల్లికార్జున మెడికల్ ఏజెన్సీ కు 2 రోజులు లింగాల ఘనపూర్ మండలానికి చెందిన మారుతీ మెడికల్ స్టోర్ కు 5 రోజులు లైసెన్సును రద్దుచేసి షాప్ లకు తాళాలు వేసినట్లు ఆయన తెలిపారు.

Leave a Reply