Inquiry | ఏ కేసులో అంటే….

Inquiry | ఏ కేసులో అంటే….

Inquiry |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే అధినేత, నటుడు విజయ్‎కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2026 మార్చి 10న ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే జనవరి 12, 19 తేదీల్లో విజయ్‌ను సీబీఐ రెండుసార్లు విచారించిన సంగతి తెలిసిందే.

ఈసారి అరెస్ట్ కు అవకాశం ఉందని తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు, ప్రచారం జోరుగా సాగుతున్నాయి. ఓ వైపు భార్య సంగీతతో విడాకుల వివాదం, మరోవైపు నటి త్రిషతో ఎఫైర్ రూమర్లు… ఇలా ఒకే సమయంలో బహుళ వివాదాల మధ్య విజయ్ ఈ కేసులో మళ్లీ విచారణ ఎదుర్కొనడం తమిళ సినీ-రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ పరిణామం ఎలాంటి రాజకీయ ప్రభావం చూపుతుందో చూడాలి.

తమిళనాడులోని కరూర్లో 2025, సెప్టెంబర్ 27న విజయ్ పార్టీ టీవీకే బహిరంగ సభ, రోడ్ షో జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఈ ర్యాలీ సెప్టెంబర్ 27 మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా, విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో జనం రద్దీ బాగా పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది.

Leave a Reply