Inquiry | చర్చనీయాంశంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Inquiry | చర్చనీయాంశంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

IASల పిల్లలకు ఇంకా రిజర్వేషన్లా?

Inquiry | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : సుప్రీంకోర్టు రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన కుటుంబాల పిల్లలకు కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడంపై ప్రశ్నలు లేవనెత్తింది.

తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉన్న పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవసరమా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్య, ఆర్థిక సాధికారతతో కుటుంబాలు అభివృద్ధి చెందినప్పటికీ.. తరతరాలుగా రిజర్వేషన్లు కొనసాగించడం సరైన విధానమా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

విద్యా, ఆర్థిక సాధికారతతో అభివృద్ధి చెందుతాం. కానీ పిల్లల కోసం మళ్లీ రిజర్వేషన్లు కోరుతూనే ఉంటాం. దీని నుంచి ఎప్పటికీ బయటపడలేము. ఇది ఆలోచించాల్సిన విషయమే అని కోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply