cbi | బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

cbi | బీజేపీపై కేజ్రీవాల్ ఫైర్

cbi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించారు.

పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా నివాసంలో ఈడీ నిర్వహించిన సోదాల నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ, సీబీఐ వంటి సంస్థలను అవినీతి నిరోధానికి కాకుండా ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ నాయకులను బెదిరించి బీజేపీలో చేర్చడమే ఈ దాడుల అసలు ఉద్దేశమని విమర్శించారు. సంజీవ్ అరోరాపై ఈడీ చర్యలు కూడా అదే రాజకీయ వ్యూహంలో భాగమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.