INDvsAFG-ODI | రోహిత్ పేరిట మ‌రో అరుదైన రికార్డ్ !!

INDvsAFG-ODI | రోహిత్ పేరిట మ‌రో అరుదైన రికార్డ్ !!

  • అర్ష్‌దీప్‌కు 100వ మ్యాచ్..

ఆంధ్రప్రభ : భారత్-ఆఫ్ఘానిస్థాన్ (INDvsAFG-ODI) తొలి వన్డేలో భారత క్రికెటర్లకు రెండు ప్రత్యేక మైలురాళ్లు నమోదయ్యాయి. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 39 ఏళ్ల 44 రోజుల వయసులో వన్డే మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 39 ఏళ్ల 36 రోజుల వయసులో వన్డే ఆడిన మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్ రికార్డును అధిగమించాడు.

భారత్ తరఫున అత్యధిక వయసులో (Oldest Indian Players to Represent India in ODIs) వన్డే ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ తొలి స్థానంలో నిలవగా, మొహిందర్ అమర్‌నాథ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తదుపరి స్థానాల్లో ఉన్నారు.

భారత్ తరఫున అత్యధిక వయసులో వన్డే ఆడిన ఆటగాళ్లు:
రోహిత్ శర్మ – 39 ఏళ్లు 44 రోజులు*
మొహిందర్ అమర్‌నాథ్ – 39 ఏళ్లు 36 రోజులు
సచిన్ టెండూల్కర్ – 38 ఏళ్లు 329 రోజులు
రాహుల్ ద్రవిడ్ – 38 ఏళ్లు 238 రోజులు
సునీల్ గవాస్కర్ – 38 ఏళ్లు 118 రోజులు

మ‌రోవైపు, భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడుతూ అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు కీలక బౌలర్‌గా మారిన అర్ష్‌దీప్.. ఈ మైలురాయి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

INDvsAFG-ODI | ఇద్దరు యువ ఆటగాళ్లకు అరంగేట్రం