Tirumala | ఎగిసిపడ్డ అగ్నికీలలు…

Tirumala | ఎగిసిపడ్డ అగ్నికీలలు…

Tirumala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) లో స్వల్పంగా కార్చిచ్చు ఘటన కలకలం రేపింది. తిరుమలలోని కాకులమాను దిబ్బ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. విండ్ మిల్స్ (Wind mills) సమీపంలో అగ్నికీలలు ఎగిసిపడడంతో స్థానికంగా కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది (Fire crew) ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వేగంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది చర్యలతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. తిరుమల (Tirumala) లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Leave a Reply