నిత్య అన్నదాన పథకానికి రూ.1.00 లక్ష విరాళం..

నిత్య అన్నదాన పథకానికి రూ.1.00 లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కే. శిరీష విరాళం అందజేశారు.
ఆమె రూ.1,00,120 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో ఈ విరాళాన్ని నిత్య అన్నదాన పథకానికి ఇచ్చినట్లు తెలిపారు.
భక్తులు అందిస్తున్న విరాళాలు దేవస్థానంలోని సేవా కార్యక్రమాల నిర్వహణకు ఎంతో దోహదపడుతున్నాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. దాతకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేదాశీర్వచనం అందించి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ జగన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, రసీదు అందజేశారు.
