సంస్థాగత బలోపేతమే లక్ష్యం..

క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే మా గమ్యం!
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొనండి
గత రెండేళ్ల అభివృద్ధిని ప్రతి ఇంటికీ తీసుకెళ్దాం..
ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుందాం!
ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్ లోని జిల్లా పార్టీ కార్యాలయంలో టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ.. సంస్థాగతంగా సమన్వయాన్ని బలోపేతం చేయడం, కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను అంచనా వేయడం, పార్టీ కేటాయించిన ప్రస్తుత ప్రచార కార్యక్రమాలు, కార్యాచరణపై చర్చించడం కోసం ఈ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసామన్నారు.

గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిల నుండి వచ్చిన ప్రతి సమస్యను జిల్లా స్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు చేపడతారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలిసి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం, వారు తెలిపిన సమస్యలను అధిష్ఠానానికి వివరించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు అందజేసిన నియోజకవర్గాల వారీగా తీర్మానాలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతామన్నారు.

ఓటర్ల నమోదు సవరణలో భాగంగా ఇప్పటికే నియమించిన బీఎల్ ఒ లు బీ ఎల్ ఏ లు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి ఓటరు ఓటును నమోదు చేస్తున్నారు. ఓట్ల నమోదులో ఎదురవుతున్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటి సాంకేతిక సమస్యలపై మరింత అవగాహన పెంచుకోవడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడటంతో పాటు, మరణించిన వారి వివరాలను ఓటర్ల జాబితా నుండి తొలగించే కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని అధిష్ఠానం సూచించిందన్నారు. సర్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు విజయవంతం చేయడానికి జిల్లా కమిటీ సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలి, రాబోయే రెండు, మూడు నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటయిందని, ప్రధానంగా, సర్ సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ‘ కార్యక్రమం, రెండవది ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం గురించి అని, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ​గత రెండేళ్లలో పార్టీ తరపున చేసిన మంచి పనులను, కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించడం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుని, వాటిని నోట్ చేసుకోవాలన్నారు.

టిడిపి జోనల్ కోఆర్డినేటర్ మంతెన వెంకట సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ల వారీగా పర్యవేక్షించడానికి ఒక సమన్వయ కమిటీని వేస్తామని, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇతర ముఖ్య నాయకులు ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, గద్దె రామ్మోహన్, కార్పొరేషన్ చైర్మన్లు కసునూరి నాగుల్ మీరా, గొట్టుముక్కల రఘురామరాజు, శావల దేవదత్, ఎరుబోతు రమణారావు, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎం. ఎస్. బేగ్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ధరణికోట విజయలక్ష్మి, తాళ్లూరు రామారావు, చలసాని రమణారావు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.