తిరుపతమ్మ ఆలయ హుండీలో భారీ కానుకలు…

తిరుపతమ్మ ఆలయ హుండీలో భారీ కానుకలు…

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మవారికి భక్తులు హుండీల ద్వారా రూ.91.95 లక్షలకు పైగా నగదు, కానుకలు, మొక్కుబడిగా సమర్పించారు.

శనివారం అమ్మవారి మండపంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. 60 రోజుల వ్యవధిలో ఆలయంలో మొత్తం హుండీలను లెక్కించగా నగదు రూపంలో రూ.91,95,850 వచ్చినట్లు ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి తెలిపారు.

అదనంగా మిశ్రమ బంగారం 25 గ్రాములు, వెండి 380 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. విదేశీ నగదులో యూఎస్ఏ డాలర్లు 123, లండన్ పౌండ్స్ 80, బ్రెజిల్ డాలర్లు 20, సెంట్రల్ బ్యాంక్ లిబియా డినార్స్ 6 వచ్చినట్లు వెల్లడించారు.

కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు. లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈఓతో పాటు ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్ బాబు, గ్రూప్ టెంపుల్స్ ఈఓలు సీహెచ్ జయప్రకాష్, బి.వి. సుబ్బారావు పర్యవేక్షించారు.



Leave a Reply