3వ వార్డులో బీఆర్‌ఎస్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు
అభ్యర్థి పిల్లలమర్రి నారాయణ కలిసి గండ్ర జ్యోతి విస్తృత ప్రచారం
భూపాలపల్లి రూరల్ ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ):
మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పిల్లలమర్రి నారాయణ తో కలిసి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి వార్డులో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆశీస్సులతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు అభ్యర్థి నారాయణను ఆప్యాయంగా స్వాగతిస్తూ తమ ఓటు బీఆర్‌ఎస్‌కే అని హామీ ఇచ్చినట్లు తెలిపారు.బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో పిల్లలమర్రి నారాయణ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని స్థానికులు వెల్లడించారు. ఈనెల 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
