ఇందిరమ్మఇండ్లు సకాలంలో నిర్మించుకోండి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని లబ్ధిదారులు సకాలంలో నిర్మాణ పనులు చేపట్టాలని త్రిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిఫ్రాస్ పల్లిలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధ్రువపత్రాలు అందజేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు మంజూరు చేస్తుందని దశలవారీగా బిల్లులో చెల్లిస్తుందని అన్నారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే మంత్రి సహకారంతో అర్హులైన వారందరికీ ఇండ్లుమంజూరు చేయిస్తామన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వేసవికాలంలో విద్యుత్ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఆంజనేయులు శేఖర్ నరసింహులు సత్యనారాయణ కృష్ణయ్య భగవంతు శరణప్ప అంజప్ప బాలప్ప వెంకటేష్ సుదర్శన్ వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
