ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి

ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి

నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బిళ్లకంటి హరిబాబును మంగళవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నాయకులు ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.

ఆర్యవైశ్యులలోని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కొట్ర బలరాం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంకేశ్వరం నిరంజన్, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హబీబ్, మాజీ కౌన్సిలర్, జిల్లా కార్యదర్శి కొత్త శ్రీనివాసులు, బిజినపల్లి మాజీ జడ్పీటీసీ పరుశరాములు, ఆర్యవైశ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply