భారత్ – వెస్టిండీస్ రెండో టెస్ట్ మూడో రోజు ఇలా..

  • ఆఖ‌రి సెష‌న్ లో విండీస్ తిరుగుబాటు…

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆసక్తికరంగా సాగింది. భారత బౌలింగ్ దళానికి పరీక్ష పెడుతూ వెస్టిండీస్ జట్టు ఊహించని తిరుగుబాటు చేసింది. 270 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆడిన విండీస్.. షాయ్ హోప్ – ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ మూడో వికెట్‌కు 138 పరుగుల అజేయ భాగస్వామ్యంతో దృఢంగా నిలిచి భారత శిబిరంలో అలసటను పెంచారు.

అయితే, ఆట తొలి సెషన్‌లో భారత బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కుల్దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను కుప్ప‌కూల్చాడు. కుల్దీప్ త‌న అద్భుత ప్రదర్శనతో.. ఐదవ టెస్ట్ ఫైఫర్ సాధించాడు. హోప్‌తో సహా (36) టెవిన్ ఇమ్లాచ్ (21), జస్టిన్ గ్రీవ్స్ (17) వంటి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.

ఇక‌ మొహమ్మద్ సిరాజ్ కూడా ఎటాక్ లో దిగాడు. రివర్స్ స్వింగ్‌తో జోమెల్ వారికన్ (1) వికెట్ పడగొట్టాడు. దీంతో వెస్టిండీస్ త్వరగా ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. అయితే, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ 9వ వికెట్‌కు 46 పరుగుల పట్టుదలగల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఆతిథ్య జట్టును కొంత నిరాశపరిచింది.

లంచ్ విరామం తర్వాత చివరకు బ్రేక్‌త్రూ లభించింది, జస్ర్పిత్ బుమ్రా పియరీ(23)ని అవుట్ చేశాడు. వెంటనే తీసుకున్న రెండో కొత్త బంతితో, కుల్దీప్ యాదవ్ ఆలస్యం చేయకుండా జైడెన్ సీల్స్‌ను (13) ఎల్.బి.డబ్ల్యు గా ఔట్ చేశాడు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను 248 పరుగులకు ముగిసింది.

ఫాలో-ఆన్..

భారీ ఆధిక్యం కారణంగా భారత్ విండీస్‌ను ఫాలో-ఆన్ ఆడించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ఆరంభం లభించినప్పటికీ, సిరాజ్ తన మొదటి స్పెల్‌లో చివరి ఓవర్‌లో చందర్‌పాల్‌(10)ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. టీ విరామానికి ముందు వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బంతితో అలిక్ అథనాజే (7) ను పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో వెస్టిండీస్ కష్టాల్లో పడింది.

అయితే, ఆట చివరి సెషన్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హోప్ – కాంప్‌బెల్‌తో జతకట్టాడు, ఈ జంట అద్భుతమైన పునరుత్థానాన్ని ప్రారంభించింది. ఇద్దరు బ్యాటర్లు తమ తమ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వారి అజేయ 138 ప‌రుగుల‌ భాగస్వామ్యం కారణంగా వెస్టిండీస్ డే 3, స్టంప్స్ సమయానికి 173/2 ఇన్ 49 ఓవర్స్ గా నిలబడింది. దీంతో వెస్టిండీస్ ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది.

Leave a Reply