India Investment Opportunities | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

India Investment Opportunities | కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్
ఫ్రాన్స్‌లో ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రసంగం
ఆవిష్కరణలు-తయారీ రంగాల్లో భాగస్వామ్యం కావాలని ఫ్రెంచ్ సంస్థలకు ఆహ్వానం

India Investment Opportunities ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : భౌగోళిక రాజకీయాలు, సాంకేతిక రంగాల్లో వేగంగా మారుతున్న పరిస్థితుల మధ్య ప్రపంచం నమ్మకమైన భాగస్వాముల కోసం ఎదురుచూస్తోందని, అలాంటి భాగస్వామిగా భారత్ నిలుస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు అపారమైన మానవ వనరులు, విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఆవిష్కరణలు ఒక సంస్కృతిగా మారాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 2.3 లక్షలకు పైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అవే భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తిని అందిస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న 120 మంది ప్రతిభావంతులైన ఆవిష్కర్తలు, స్టార్టప్ ప్రతినిధులు భారత్ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత్‌తో మరింత బలమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవాలని ఫ్రెంచ్ సంస్థలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. భారత్‌లోని భారీ దేశీయ మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతుల అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. డిజైన్, ఆవిష్కరణ, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అనువైన గమ్యస్థానమని పేర్కొంటూ, ఫ్రెంచ్ వ్యాపార వర్గాలు భారత్‌ను సందర్శించి భాగస్వామ్యాలను మరింత విస్తరించాలని ఆహ్వానించారు.

India Investment Opportunities

Leave a Reply