16.06cr | తెలంగాణలో టార్గెట్ 16కోట్ల మొక్కలు
16.06cr | తెలంగాణలో టార్గెట్ 16కోట్ల మొక్కలు
గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
శాఖల వారీగా లక్ష్యాల నిర్దేశం
16.06cr | హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో పచ్చదనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం-2026 ఈ నెల 18న ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అర్బన్ ఫారెస్ట్ పార్కులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ విస్తృత స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాలు చేపట్టనున్నారు.
శాఖల వారీగా పంచాయతీరాజ్ శాఖకు 6.18 కోట్ల మొక్కలు, హెచ్‌ఎండీఏ పరిధిలో 4.50 కోట్ల మొక్కలు, అటవీ శాఖకు 89.59 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన మొక్కలను ఇతర శాఖల ద్వారా నాటించనున్నారు. వనమహోత్సవం విజయవంతం అయ్యేలా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో హరితవనం విస్తరణ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత సాధన లక్ష్యాలతో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది.
