MLC | సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

MLC | సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

MLC | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తానని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ కెప్టెన్‌ సీఎం రేవంత్‌రెడ్డేనని పేర్కొంటూ ఆయన తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు.

తనను ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన మంత్రిమండలి, పీసీసీతో పాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీకి అజారుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా మరింత కృషి చేస్తానని చెప్పారు.

రాజకీయాలు, జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచే మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తాను కెప్టెన్‌ను కాదని, తమ అసలైన కెప్టెన్‌ రేవంత్‌రెడ్డేనని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.

Leave a Reply