వడ్డీ సహా చెల్లించాల్సిందే

వడ్డీ సహా చెల్లించాల్సిందే
- మా డిజిటల్ బుక్ వచ్చేసింది
- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప
- ప్రస్తుత ఎమ్మెల్సీ ఇస్సాక్…
నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నేతలపై, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, మర్డర్లు, కక్షపూరిత చర్యలను అన్నింటిని డిజిటల్ బుక్(Digital book)లో నమోదు కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు.నంద్యాల వైసీపీ కార్యాలయంలో సోమవారం డిజిటల్ బుక్ లో ఫిర్యాదుల నమోదు కొరకు రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ల(QR code posters)ను శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ భాషా మాజీ మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి(PP Nagireddy), ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉమెన్ వింగ్ ఉపాధ్యక్షురాలు డా.శశికళారెడ్డి,మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరరెడ్డి, డిస్ట్రిక్ట్ ఇనటలెక్చువల్(District Intellectual) ప్రసిడెంట్ రసూల్ ఆజాద్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాష, డిస్ట్రిక్ట్ స్పోక్ పర్సన్ అనీల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ(Tyler Siva), ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, నెరవాటి సత్యనారాయణ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ(YSRCP) నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, మర్డర్లు, కక్షసాధింపు చర్యలు, ఆస్తుల విధ్వంసం, ఆక్రమణలు, ఇలా అనేక అన్యాయాలకు తెరతీసిందన్నారు. ఇటువంటి చర్యలను కాలం మరచిపోవచ్చని, జరిగిన అన్యాయాలను, అక్రమాలను మరచి పోకుండా భద్రపరిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను రూపొంచారని వివరించారు.
ఈ క్యూర్ కోడ్ ను స్కాన్ చేసి అందులో జరిగిన అన్యాయాలను రిజిస్టర్(Register) చేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన కాలంలో అధికారులు అన్యాయంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామన్నారు. ఇటువంటి అధికారులు(Officials) భవిషత్తులో జవాబు చెప్పక తప్పదని, మూల్యం చెల్లించక తప్పదని, వడ్డీతో సహా చెల్లించక తప్పదని అధికారులు జాగ్రత్తగా పని చేయాలని వార్నింగ్ ఇచ్చారు.
