Incident | ఏమైందో ఏమో… కానీ…
Incident | ఏమైందో ఏమో… కానీ…
Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవ దంపతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. భర్త ఉరేసుకోగా, భార్య విషం తాగి ప్రాణాలు తీసుకుంది.
కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన కార్తీక్, మంజుల ఇటీవలే వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. అయితే కుటుంబ పరిస్థితులా, వ్యక్తిగత సమస్యలా అన్నది ఇంకా స్పష్టంగా తెలియకముందే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

కార్తీక్ ఇంట్లో ఉరేసుకుని మృతి చెందగా, మంజుల విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యలకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
