Reception | ఎన్నికల కౌంటింగ్ సజావుగా చేపట్టండి….

Reception | ఎన్నికల కౌంటింగ్ సజావుగా చేపట్టండి….

Reception | ఊట్కూర్, ఆంధ్రప్రభ : తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా చేపట్టేందుకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించారు.

సామాగ్రి పంపిణీ రిసెప్షన్(Reception) కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టడంతో అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలో పోలింగ్ ప్రక్రియ(polling process) ఎన్నికల నిబంధనల ప్రకారం చేపట్టాలనిఆదేశించారు.

రెండు విడతల్లో కొనసాగిన ఎన్నికలు సజావుగా కొనసాగాలని తుది విడత ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలన్నారు. ఎన్నికల సామాగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల( ballot papers)ను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించే అవకాశం ఉన్నందున పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎవరూ ఆఫ్ చేయరాదని అన్నారు. పోలింగ్ కేంద్రాల లోపలికి పోలీసులు వెళ్లరాదని, కేంద్రాల ఆవరణలోనే బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడి వారికి ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించారు.

రూట్, జోనల్, నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని సూచించారు. చెక్‌లిస్ట్(checklist) ప్రకారం తమకు అందజేసే సామాగ్రిని సిబ్బంది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, అదనపు సామాగ్రి అవసరమైతే ఆర్.ఓలు, జోనల్ అధికారులను సంప్రదించాలని తెలిపారు.


ఫారం–9 ప్రకారం బ్యాలెట్ బాక్స్‌ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఉదయం ఖచ్చితంగా 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి, మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు(vote counting) పూర్తయిన అనంతరం అబ్జర్వర్ ఆదేశాల మేరకే ఫలితాలను వెల్లడించాలని స్పష్టం చేశారు.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత వినియోగించిన సామాగ్రిని సక్రమంగా సీల్ చేసి డిపాజిట్(deposit) చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు చేపట్టే అధికారులు సిబ్బంది సంయమనం నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీను, శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎస్సై రమేష్,తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply