తెలుగుతల్లి పార్కులో10 లక్షల రూపాయలతో…
తెలుగుతల్లి పార్కులో10 లక్షల రూపాయలతో…
సోలార్ లైట్స్,ఐమాక్స్ లైటింగ్..
ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన…
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాజీవ్ నగర్ తెలుగుతల్లి పార్కులో సుమారు10 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ లైట్స్,ఐమాక్స్ లైటింగ్,వాకింగ్ ట్రాక్ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా సోమవారం శంకుస్థాపన చేశారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యం, పోలీస్ పెట్రోలింగ్ బలోపేతం, సామాజిక సమస్యల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించిందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.స్థానిక 63వ డివిజన్ ఉడా కాలనీ పరిధిలోని తెలుగు తల్లి పార్క్‌లో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్క్ గేట్, సోలార్ లైట్లు, (ఐమాక్స్) లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.
సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, 2024కు ముందు మరుగునపడిన అనేక సమస్యలను గుర్తించి,వాటిని దశలవారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించి, వాటిని వేగంగా పరిష్కరించడం జరుగుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, పైడి తులసి,క్లస్టర్ ఇంచార్జి బత్తుల కొండ, డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం దుర్గా , ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇంచార్జ్ మోత్కూరి ఖాసిమ్,ఉప్పతల దుర్గారావు, మెహర్,తాడిశెట్టి నాగలక్ష్మి,దుర్గసి రాము, బాజీ, తదితరులు పాల్గొన్నారు.
