జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం

ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ఏకగ్రీవం
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవి చంద్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మంగళవారం జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ సభ్యుల సమావేశం పట్టణంలోని ఉక్కు కళా వేదికలో జరిగింది. ఈ సమావేశంలో జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా అల్లి రవిచంద్ ,కార్యదర్శిగా సందల శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు గా మైలా విజయపాల్, కాకనబోయిన శివరామకృష్ణ ,ట్రెజరర్ గా షేక్ నజీర్ మీరా, జాయింట్ సెక్రెటరీల గా ఆరుద్ర నాగేశ్వరరావు, ఆశీర్వాదం,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా కే ఆనంద్ బాబు, యూనియన్ పెద్దలు ముత్యాల సైదేశ్వరరావు, యలదండి శ్రీనివాసరావు, కట్ట గురవయ్య. జూటూరు అప్పారావు కటకం ప్రసాద్ లు ప్రెస్ క్లబ్ సభ్యులు గా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కమిటీ ప్రతినిధులను పూలదండలు వేసి శాలవాలతో సన్మానించి సత్కరించారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా ఐ జె కోటయ్య, కార్యదర్శిగా పి సాంబశివరావు, కోశాధికారిగా వల్లాపురపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా సోమోజు నాగ సత్య శ్రీనివాసరావు, వై నాగేశ్వరరావు నాయుడు, జాయింట్ సెక్రెటరీలుగా జానీ, ఆనంద్ బాబు లు ఎంపికయ్యారు.
వత్సవాయి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఏకగ్రీవం గా ఎన్నిక అయిన బుర్రి వెంకట్, కార్యదర్శి నెల్లూరి రవి ల ను వత్సవాయి ప్రెస్ క్లబ్ విలేకరులు అభినందించారు. పెనుగంచిప్రోలు అధ్యక్షుడిగా దండా రామకృష్ణ సెక్రటరీగా చేని రాంబాబు లు ఎన్నికయ్యారు. జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ సభ్యులు నూతనంగా ఎంపికైన అధ్యక్షులను కార్యదర్శులను కమిటీ ప్రతినిధులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
