వికసించిన ‘మే’ పుష్పం

వికసించిన ‘మే’ పుష్పం

నిజామాబాద్, ఆంధ్రప్రభ: నగరంలోని వినాయక్ నగర్ యోగేశ్వర కాలనీ లో నివసించే ప్రభుత్వ గిరిరాజ కళాశాల రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫే సర్,శబ్ద తరంగిణి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సేర్ల దయానంద్-సేర్ల భాగ్యలక్ష్మి దంపతుల స్వగృహంలో ఆదివారం ‘మే’ ‘పుష్పం’ వికసించింది.

ప్రతి సంవత్సరం మే నెలలోనే వికసించే ఈ ‘మే’ పుష్పంను చూసిన కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల నివసించే పలువురు స్థానికులు ఈ పుష్పం చూడగానే కనువిందు చేస్తుందని పుష్పం ను చూసి తన్మయం చెందామని పలువురు స్థానికులు ఈ సందర్బంగా పేర్కొన్నారు.

ప్రతి ఏడాది మే నెలలో తమ ఇంటి ఆవరణలో వికసిస్తున్న ఈ ‘మే’ పుష్పం 15రోజులు మాత్రమే ఉంటుందని సేర్ల దయానంద్ -భాగ్యలక్ష్మి దంపతులు ఈ సందర్బంగా తెలిపారు. గత పదేళ్లుగా తమ స్వగృహం ఆవరణలో వున్న మిగితా పూల చెట్లలో ఈ ‘మే’ పుష్పం వికసిస్తుండటంతో చుట్టు పక్కల వారు తనివితీర చూసి అబ్బుర పడుతున్నారని వారు చెప్పారు.

అరేబియా దేశం నుంచి మన దేశానికి ఈ పుష్పం ను తీసుకురావడం జరిగిందన్నారు. అరేబియా దేశంలో ఈ పుష్పంను ఫుట్బాల్ పుష్పమని, ఎరుపు రంగులో ఉండటంతో ఈ పుష్పంను ‘అగ్ని ‘పుష్పమని కూడా అంటారని వారు వివరించారు. చక్కగా ఎరుపు రంగులో అందంగా వికసించిన ఈ ‘మే ‘ పుష్పం చూడ ముచ్చటగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply