iBOMMA | ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇమ్మడి రవి…

iBOMMA | ఐదు రోజుల పోలీస్ కస్టడీ ఇమ్మడి రవి…
హైదరాబాద్ : ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ iBOMMA ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని కస్టడీకి ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ జరిపి కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి కోర్టు ఇమ్మడి రవిని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ వంటికి ఏమైనా జరిగి ఉండచ్చు అనే అనుమానాలతో.. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దృష్టి పెట్టింది. ఈ కస్టడీ సమయంలో ఇమ్మడి రవిని లోతుగా విచారించి, పైరసీ రాకెట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్ వివరాలను తెలుసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
