CPI 100 years | పేదల పక్షాన పోరాడేది సీపీఐ
CPI 100 years | పేదల పక్షాన పోరాడేది సీపీఐ
CPI 100 years | మునుగోడు, ఆంధ్రప్రభ : కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ఖమ్మంలో జరగనున్న సీపీఐ100 సంవత్సరాల(CPI 100 years) ముగింపు వేడుకల సందర్భంగా గద్వాల నుంచి ప్రారంభమైన ప్రచార జాత ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలంకు చేరుకుంది.
ఈ సందర్భంగా సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ(bike rally)తో ప్రచార జాతకు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(MLC Nellikanti Satyam) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన చట్టాల కోసం నిరంతరం సీపీఐ పోరాటాలు నిర్వహించిందని అన్నారు.
రాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టుల కోసం సీపీఐ చేసిన అలుపెరగని పోరాటాలతోనే సాగునీటి ప్రాజెక్టులు సాధించామని పేర్కొన్నారు. ముగింపు ఉత్సవాలకు పార్టీ శ్రేణులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ(Bala Narasimha), ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం(Guraja Ramachandram), బొలుగూరి నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు సురిగి చలపతి, గోసుకొండ లింగయ్య, బండమీది యాదయ్య, మందుల పాండు, వనం వెంకన్న, ఉప్పునూతల రమేష్, కాగితం వెంకన్న, మాధగోని సత్తమ్మ, దుబ్బ వెంకన్న, ఈదులకంటి కైలాస్, బండారు శంకర్, కట్కూరి లింగస్వామి, చాపల విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.
