Vivek Venkataswamy | అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Vivek Venkataswamy | అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

మంత్రి వివేక్ వెంకటస్వామి


Vivek Venkataswamy | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు (Chennur) నియోజకవర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అధికారులను సూచించారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురోగతి, జరుగలసిన పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తూ త్వర్తిగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కిష్టంపేట గ్రామంలో నిర్వహించిన మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ (Indira Gandhi) 108వ జయంతిని పూరష్కరించుకొని ఎస్ హెచ్ జీ మహిళల సభ్యులకు చీరలను పంపిణీ చేశారు.

Leave a Reply