Uttam Kumar Reddy | అభివృద్ధిలో హుజూర్‌నగర్ ను అగ్రగామిగా ఉంచుతా..

  • సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి సుపరిపాలన అందించాలి
  • కాంగ్రెస్ అభ్యర్ధులు ఓడిపోయిన చోట ఆత్మవిమర్శ చేసుకోవాలి
  • ఒక్కో గ్రామ పంచాయతీకి అదనంగా 30 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తా
  • రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోనే హుజూర్‌నగర్ నియోజకవర్గంను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతానానని రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కౌండిన్య పంక్షన్ హాల్ లో శనివారం హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ నెంబర్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ నెంబర్లకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్ధులు అధైర్యపడొద్దని వారికి అండగా ఉంటానని, ఓటమి నుండి గుణపాఠం నేర్చుకావాలన్నారు.

కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి అక్కడి నాయకుల సమన్వయ లోపమే అని నేను అన్ని గమనిస్తున్నానని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందారన్నారు.

ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ కట్టడి చేయాలని ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు గా మారుతుందన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ అన్నారు. నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రిగా బాధ్యతాయుతంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉన్న ఈ ప్రాంతానికి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ షాపుల ద్వారా 3కోట్ల 20 లక్షల మంది పేదలకు ఒక్కొక్కరి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తూ, నూతన రేషన్ కార్డులు ఇచ్చామన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు, మహిళ స్వయం సంవృద్ధికి విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. హుజూర్ నగర్ నియోజక వర్గంను అభివృద్ధి పథంలో ముందుంచేలా నూతన ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు, పునరుద్ధరణ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతూ ఆయకట్టు విస్తీర్ణం మరింత పెరిగేలా పనులు జరుచున్నాయన్నారు.

ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు నూతనంగా సిటీ స్కాన్, రక్తనిధి కేంద్రం, డయాలసిస్ సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులు, విద్యాభివృద్ధికై ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల నూతన భవనాలు, ఐటీఐ కళాశాల ఇంటిగ్రేటెడ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించి పనులను ప్రారంభించామన్నారు.

హుజూర్ నగర్ పట్టణంలో ట్రాపిక్ సమస్య లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చామన్నారు. ఇప్పటికే నూతన ఆర్ అండ్ బి భవన్ షాపింగ్ కాంప్లెక్స్, ఇరిగేషన్ భవనం నిర్మాణ పనులను చేపట్టామన్నారు.

ఫణిగిరి రామస్వామి గుట్టవద్ద మోడల్ కాలనీ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ కి 25 నుంచి 30 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయిస్తానని అర్హులైన పేదవారిని గుర్తించి ఇవ్వాలని ఆయా సర్పనుచులకు హామీ ఇచ్చారు. అనంతరం నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ వార్డ్ నెంబర్ల ను శాలువ తో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక, నేరెడుచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్ష్మి వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశుముఖ్, పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, ముఖ్య నాయకులు సాముల శివారెడ్డి, యరగాని నాగన్న, దొంతగాని శ్రీనివాస్, గెల్లి రవి, దొంగరి వెంకటేశ్వర్లు, ఈడ్పుగంటి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు చక్కర వీరారెడ్డి, భూక్యా మంజున్నాయక్, నరాల కొండారెడ్డి, కాకునూరి భాస్కరరెడ్డి, త్రిపురం అంజన్ రెడ్డి, కొణతం చిన వెంకటరెడ్డి, ఎన్వీ.సుబ్బారావు, మోతిలాల్ నాయక్, గోపాల్ నాయక్, నియోజకవర్గ పరిధిలోని నూతన సర్పంచులు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply