SRR Foundation | ప్రజా సేవకుడిని వరించిన పద్మ మోహన అవార్డు

SRR Foundation | ప్రజా సేవకుడిని వరించిన పద్మ మోహన అవార్డు
- ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సేవలను గుర్తించిన టీవీ రంగం
- బుల్లితెర పెద్ద పండుగలో పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి అవార్డు ప్రధానం
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతులమీదుగా అవార్డు అందుకున్న పరుపాటి
- హర్షం వ్యక్తం చేస్తున్న రాయపర్తి మండల ప్రజలు
SRR Foundation | రాయపర్తి, ఆంధ్రప్రభ : ప్రజాసేవే పరమావధిగా.. ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా.. బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్(SRR Foundation) చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి పద్మ మోహన్ అవార్డు(Padma Mohan Award) రావడంతో మండల ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవలందిస్తున్న పరిపాటి శ్రీనివాస్ రెడ్డి గొప్పతనాన్ని టీవీ రంగం గుర్తించింది. ఈ మేరకు బుల్లితెర పెద్ద పండుగ మహోత్సవాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్(MLA Naveen Yadav) చేతులమీదుగా పరుపాటి శ్రీనివాస్ రెడ్డికి పద్మ మోహన అవార్డును ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసేవ చేయడమే తనకు తెలుసు అని తమ సేవలను గుర్తించడం ఒక్కింత సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. రాయపర్తి మండలం నుండి మొదలైన సేవా కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజాసేవ చేయడంలోనే సంతృప్తి దొరుకుతుందని ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని కోరారు. రంగం ఏదైనా సేవ చేయడంలో ముందు ఉండడానికి శాయశక్తుల కృషి చేస్తున్నానని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో మును ముందు ప్రజాసేవను విస్తృతం చేస్తానని స్పష్టం చేశారు.
