2 crores | ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌కు జ‌ల‌సంర‌క్ష‌ణ పుర‌స్కారం

2 crores | ఆదిలాబాద్ క‌లెక్ట‌ర్‌కు జ‌ల‌సంర‌క్ష‌ణ పుర‌స్కారం

  • రూ. రెండు కోట్ల రివార్డు ప్ర‌దానం చేసిన రాష్ట్ర‌ప‌తి

2 crores | ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : జల సంరక్షణ, నీటి వనరుల సద్వినియోగంలో ఫ‌లితాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కలెక్టర్ రాజార్షి షా(Rajarshi Shah)కు జాతీయ స్థాయి జల‌సంరక్ష‌ణ పుర‌స్కారం ద‌క్కింది. ఈ రోజు న్యూఢిల్లీ(New Delhi)లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ. 2 కోట్ల నజరానా తో కూడిన పురస్కారాన్నిప్ర‌దానం చేశారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో జల సంరక్షణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “జల్ చంచాయ్ – జన్ భాగీధారీ(Jal Chanchai – Jan Bhagidhari)” కార్యక్రమంలో భాగంగా ఈ అత్యున్నత పుర‌స్కారం దక్కింది.

జాతీయస్థాయిలో ఆస్పిరేషనల్ అవార్డు(aspirational award) తర్వాత జల శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నత పురస్కారం అందించడం ఆనందంగా ఉందని కలెక్టర్ రాజార్షి షా పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆదిలాబాద్ జిల్లాలో జలాల సద్వినియోగం పై మరిన్ని కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. జిల్లాకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు పట్ల అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.