TTD | రేపే ప్రత్యేక టికెట్ల విడుదల!
ఆంధ్రప్రభ, వెబ్డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూలై నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లను జూన్ 25న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఒక్క టికెట్ ధర రూ.1,600 కాగా, ఇద్దరు భక్తులు హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ హోమం తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుంది.
హోమంలో పాల్గొన్న భక్తులు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించబడుతుంది. జూలై నెలలో తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard సందర్శించండి.
