శ్రీ వెంకటేశ్వరస్వామికి చక్రస్నానం..
శ్రీ వెంకటేశ్వరస్వామికి చక్రస్నానం..
- ఒడి బియ్యం వండి భక్తులకు అన్న సంతర్పణ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో గల శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఘనంగా చక్రస్నానం చేయించారు. అనంతరం స్వామి వారి ఒడిబియ్యాన్ని వండి భక్తులకు అన్నసంతార్పణ చేశారు. అదివారం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్, కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఊడుగు జ్యోతి రమేష్ గౌడ్, పిల్లలమర్రి మధుసూదన్, ఊదరి యాదయ్య, కోయ్యడ శేఖర్, బత్తుల జయమ్మ దాసు, గడ్డం ఇందిర రాజారత్నం, పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, దేవాలయ కమిటీ అద్యక్షుడు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, ఊదరి శ్యామ్ సుందర్, ప్రధాన కార్యదర్శి ఊదరి శంకర్, కోశాధికారి ఎలకరాజు నాగరాజు (మల్లేష్), ఉష్కాగుల శ్రీనివాస్, తోర్పునూరి నరసింహ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, తొర్పునూరి మల్లేష్ గౌడ్, గట్టు పవన్, నకరకంటి శ్రీశైలం, ఊదరి మారయ్య, చెవగొని మహేష్, జక్కర్తి శేఖర్, నల్ల పర్వతాలు, ఉయ్యాల పల్లవి, గంగిరెడ్డి నాగలక్ష్మి, బత్తుల శ్రీశైలం గౌడ్, మంచికంటి భాస్కర్, గుజ్జల సురేందర్ రెడ్డి, అన్నెమోని గోవిందరాజు, ధర్మకర్తల మండలి బత్తుల విప్లవ గౌడ్, కాసుల వెంకటేష్, బాల్యం వెంకటాచలపతి, నల్ల గణేష్, ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, భక్తులు పాల్గొన్నారు.
