బంకుల వద్ద భారీ రద్దీ..

బంకుల వద్ద భారీ రద్దీ..
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్న వార్తల నేపథ్యంలో వినియోగదారులు బంకు వద్ద బారులు తీరారు. ఇంధనం అందుబాటులో లేకపోతే వాహనాలు నడపడం కష్టతరమవుతుందనే ఆందోళనతో బైకులు, కార్ల యజమానులు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు ముందస్తు జాగ్రత్తగా అదనంగా ఇంధనం నిల్వ చేసుకునేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో పెట్రోల్ బంకు వద్ద ఉదయం నుంచే వాహనదారులు క్యూ కట్టారు.
