పేదల కష్టాల్లో అండగా సీఎం సహాయనిది..
- సీఎం సహాయనిది చెక్కులను అందజేసిన డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు
కేసముద్రం, ఆంధ్రప్రభ : పేదప్రజల కష్టాల్లో సీఎం సహాయనిది అండగా ఉంటుందని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ సహకారంతో మంజూరు అయిన సీఎం సహాయనిది చెక్కులను కొడారి మల్లమ్మ 28,000, లింగాల సంధ్య 40,000,దర్శనం సాయిలు 33,000, మరగని మంజుల 31,000 ల చెక్కులను కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ అల్లం రమ-నాగేశ్వర్ రావు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అల్లం రమ-నాగేశ్వర్ రావు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉండి ప్రైవేట్ ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఆసరాగా నిలుస్తుందని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధారావత్ కిషోర్, ధన్నసరి గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండ సురేష్, వేం అజిత్ రెడ్డి, నర్రా అశోక్ తదితరులు ఉన్నారు.
