కరెంటు షాక్‌తో ఇల్లు దగ్ధం..

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో పొన్నాల రాజవ్వ-చంద్రయ్య కు చెందిన నివాసంలో కరెంటు షాక్ వలన ఇంటిలో ఉన్న టీవీ, బియ్యం, బట్టలతోపాటు నిత్యావసర వస్తువులు కాలిపోయాయి.చంద్రయ్య చాకలి వృత్తితో పాటు కూలీ పని చేసుకుని జీవనం గడుపుతున్నారు. 100 రోజుల కూలీ పని కోసం కొడుకు, కోడలు ఇద్దరూ వెళ్ళగా చంద్రయ్య,రాజవ్వ దంపతులు వృత్తి పనికి వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో నుండి మంటలు రావడం గమనించిన చుట్టు ప్రక్కల వారు వెంటనే కూలీ పనులకు వెళ్లిన కొడుకుకు కాల్ చేసి చెప్పడంతో వెంటనే ఇంటికి వచ్చి చుట్టూ పక్కల వారి సహాయంతో మంటలను అర్పివేశారు.అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న టీవి, బియ్యం సంచులు, బట్టలతో పాటు, నిత్యావసర వస్తువులు కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బందితో పాటు, స్థానిక పోలీసులు,రెవెన్యూ అధికారులు వచ్చి పరిశీలించారు.ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు కోరారు.