Phone Tapping Case లో కీలక మలుపు…

Phone Tapping Case లో కీలక మలుపు…

  • జూన్ 1న విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్, మే 29 (ఆంధ్రప్రభ) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేయాలని సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు, ప్రజాప్రతినిధుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తొలిసారిగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆ తరువాత మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు నమోదు చేయడంతో కేసు విచారణ వేగం అందుకుంది. ప్రస్తుతం అధికారులు ఆధారాలను సేకరిస్తూ విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జూన్ 1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారుల ఎదుట హాజరై కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply