ఘోర రోడ్డు ప్ర‌మాదం…

ఘోర రోడ్డు ప్ర‌మాదం…

ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు…

అద్దంకి, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో కారు స్కూటర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చక్రాయపాలెం వద్ద గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఇందునగర్ చెందిన కొటికలపూడి శ్రీను 35 సం.లు, గుంటూరుకు చెందిన షేక్ సాంబయ్య 37 సం.లు, అదే గుంటూరుకు చెందిన షేక్ రాజు ముగ్గురు స్నిహితులు కలిసి బల్లికురవ కొమ్మలపాడు వద్ద జరుగుతున్న ఉరుసు కార్యక్రమానికి వెళుతున్నారు.

ఈ క్రమంలో చక్రాయపాలెం వద్ద నామ్ రోడ్డులో స్కూటర్ను కారు ఢీకొన్నది. ఈ ఘటనలో కొటికలపూడి శ్రీను షేక్ సాంబయ్య ఇద్దరూ అక్కడకే మృతిచెందగా, షేక్ రాజు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. సమాచారం మేరకు కొరిశపాడు, బల్లికురవ మండలాల్లోని 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి తీవ్ర గాయాలు చెందిన క్షతగాత్రుడిని చికిత్స కొరకు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు క్షతగాత్రునికి ప్రాధమిక చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కొరకు ఒంగోలుకు తరలించారు. సమాచారం మేరకు అద్దంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఈ ఘటనలో మృతి చెందిన మౌలాలి, సాంబయ్య ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply