Hats Off SBI : అగ్గి నష్టానికి కళ్లెం

Hats Off SBI : అగ్గి నష్టానికి కళ్లెం
గుడివాడ నడిబొడ్డులో .. తప్పిన భారీ అగ్ని ప్రమాదం
మంటల్లో కమర్షియల్ కాంప్లెక్స్
క్షణాల్లో ఎస్పీఐ డిటెక్టర్ వార్నింగ్
తక్షణం అగ్నిమాపక దళం స్పందన
ఒక సెల్ ఫోన్ షాపు.. మరో వస్త్ర దుకాణం బుగ్గి
( ఆంధ్రప్రభ, గుడివాడ ప్రతినిధి)

Hats Off SBI : కృష్ణాజిల్లాలో.. ప్రముఖ వాణిజ్య కేంద్రం గుడివాడ కంగుతింది. తెల్లవారుజామున అగ్నిదేవుడు విరుచుకు పడ్డావు. గుడివాడ నడిబొడ్డులోని ఓ వాణిజ్య కేంద్రంపై అగ్గి రగిల్చాడు. ఓ బ్యాంకు (Hats Off SBI ) అల్లారంతో.. అగ్నిమాపక దళం స్పందించి.. సకాలంలో దూసుకు వెళ్లి .. నీళ్లు చల్లటంతో తీవ్ర నష్టం తప్పింది.
Hats Off SBI : ఇప్పటికే దాదాపు అరకోటి నష్టం (50 Lakhs Loss) వాటిల్లింది. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహిరించినా.. కళ్ల ముందే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగేంది. ఎందుకంటే… ఈ కాంప్లెక్స్ లోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఓ జూనియర్ కళాశాల.. ఇక వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ భస్మీపటలం అయ్యేవి. ఇంతకీ అసలేం జరిగింది?

ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటల ప్రాంతంలో.. గుడివాడ నడిబొడ్డులోని నెహ్రూ చౌక్ సెంటర్ (Nehru Chowk) లోని కమర్షియల్ కాంప్లెక్స్ లో (Blaze) మంటలు రాజుకున్నాయి. దట్టమైన పొగ ఆవరించింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన దుకాణాల్లోని వస్త్రాలు, విలువైన యంత్ర సామాగ్రి భస్మం అయ్యాయి.
Hats Off SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఫైర్ డిటెక్టర్ (Fire Detector) ప్రమాదం పసిగట్టింది. సైరన్ .. అలెర్ట్ (Alerted) చేయటంతో.. గుడివాడ (Gudiwada Fire Department) అగ్నిమాపక దళం కదిలింది. నిజానికి కృష్ణాజిల్లాలో అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది మొత్తం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న భవానీ దీక్షల విరమణలో.. అప్రమత్తం విధుల్లో ఉన్నాయి.

ఈ తరుణంలో (Hanuman Junction) హనుమాన్ జంక్షన్, (Uyyuru) ఉయ్యూరు ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను రప్పించి… అగ్పికీలలపై యుద్ధానికి దిగాయి. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. భారీగా మంటలు పొగ అలుముకోవడంతో, సమీప ప్రాంతాల్లోని నివాసితులు భయాందోళనతో రోడ్ల పైకు వచ్చారు. ఓ సెల్ ఫోన్ షాపులో ముందుగా మంటలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.
Hats Off SBI : తప్పిన పెను ప్రమాదం
ఈ అగ్నిప్రమాదం తీవ్రత అంతా ఇంత కాదు. గుడివాడ పట్టణంలోనే అద్దెపల్లి కాంప్లెక్స్ (Addepalli Complex) కూడా అతి పెద్దదే. పైగా నెహ్రూ చౌక్ వాణిజ్య కూడలిలో ఉంది. కేవలం మూడు అగ్నిమాపక శటకాలతో సిబ్బంది ఈ మంటలను ఆర్పటం చాలా కష్టం. కానీ సమయ స్ఫూర్తితో ఫైర్ సిబ్బంది పెను ప్రమాదాన్ని తప్పించారు.

Hats Off SBI : ఎందుకంటే అద్దెపల్లి కాంప్లెక్స్ సెల్లార్ లో .. ఫ్లెక్సీ ఫ్రింటింగ్ సంస్థ (Flexy Printing) పని చేస్తోంది. ఇక్కడ వినైల్ తదితర రసాయనాల (Camical Tins) టిన్నులు ఉన్నాయి. ఏమాత్రం మంటలు వ్యాపించి ఉంటే.. ఈ భవనం భస్మీపటలమయ్యేది. కడకు అగ్ని ప్రమాదంపై హెచ్చర్చించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ భారీ నష్టం సంభవించేంది. రికార్డులు, నగదు, బంగారు నగలు కనిపించేవి కాదు. అందుకే సెల్లారుల్లో ఇలాంటి వ్యాపారాలకు అవకాశం ఇవ్వకూడదని ఎంత మొత్తుకున్నా.. అధికారులు స్పందించటం లేదు. జరగరాని ప్రమాదం జరిగితే.. ఈ కాంప్లెక్స్ లో వ్యాపార సంస్థలు కుదేలయ్యేవి.ఇన్సూరెన్స్ ఉందిలే.. అనుకుంటే.. ఈ ప్రమాదం జరగటం అత్యవసరమా?
Hats Off SBI : ఘటనా స్థలిలో ఎమ్మెల్యే ..

గుడివాడ పట్టణ నడిబొడ్డులోని అద్దేపల్లి కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా భారీ నష్టం బాధాకరమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము (MLA Venigandka Ramu) ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన అద్దేపల్లి కాంప్లెక్స్ భవనాన్ని ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అగ్నికి అహుతయిన కాంప్లెక్స్ లోని దుకాణాలను స్వయంగా పరిశీలించారు, అధికారులను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

Hats Off SBI : ఈ సందర్భంగా నష్టపోయిన దుకాణదారులతో మాట్లాడుతూ మనోధైర్యం చెప్పారు.ఈ అగ్ని ప్రమాదం కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రగాఢ సానుభూతి ఎమ్మెల్యే రాము తెలిపారు. బాధితులకు ప్రభుత్వపరంగా అవకాశం ఉంటే సహాయం అందిస్తానని పేర్కొన్నారు గుడివాడలో ఇటీవల తరచు అగ్ని ప్రమాదాలు జరగడం బాధాకరం అన్నారు. ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల పై పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం (Special Meeting) నిర్వహిస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగాన్ని ఎమ్మెల్యే రాము అభినందించారు. జనసేన ఇన్ చార్జి బూరగడ్డ శ్రీకాంత్, ఇమేజ్ రవి, టీడీపీ నాయకులు, చేకూరు జగన్ మోహన్ రావు , టీం వేనిగండ్ల సభ్యులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ASLO READ : Nightmare in Goa : Palms క్లబ్ విస్ఫోటనం
