Hollywood | ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు, న‌టి ఎవ‌రంటే….?

Hollywood | ఆస్కార్ ఉత్త‌మ న‌టుడు, న‌టి ఎవ‌రంటే….?

Hollywood | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : లాస్ ఏంజెలెస్ డాల్బీ థియేట‌ర్ లో అట్ట‌హాసంగా హాలీవుడ్ సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల వేడుకగా పేరుగాంచిన 98వ అకాడమీ అవార్డుల వేడుక జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ అవార్డుల కార్యక్రమంలో పలు చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ముఖ్యంగా ‘ఫ్రాంకెన్‌స్టైన్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ వంటి చిత్రాలు పలు కేటగిరీల్లో విజేతలుగా నిలిచి ఈ ఏడాది అవార్డుల వేడుకలో తమదైన ముద్ర వేశాయి. ఈ వేడుకలో టెక్నికల్ విభాగాల్లో ‘ఫ్రాంకెన్‌స్టైన్’ చిత్రం విశేషంగా మెరిసింది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ఈ చిత్రం అవార్డును దక్కించుకుంది.

ఈ చిత్రానికి టమారా డెవరెల్ ప్రొడక్షన్ డిజైన్ నిర్వహించగా, షేన్ వియో సెట్స్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ఈ విభాగంలో ‘హామ్నెట్’, ‘మార్టీ సుప్రీమ్’, ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’, ‘సిన్నర్స్’ చిత్రాలు కూడా నామినేషన్లు పొందాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ‘అవతార్: ఫైర్ అండ్ అష్’ చిత్రం విజేతగా నిలిచి మరోసారి తన సాంకేతిక ప్రతిభను చాటుకుంది. ఈ చిత్రానికి జో లెటెరి, రిచర్డ్ బెనెహామ్, ఎరిక్ సైన్డన్, డానియెల్ బారెట్ విజువల్ ఎఫెక్ట్స్ అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ చిత్రం – వన్ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ నటుడు: మైఖేల్‌ బి జోర్డాన్‌ (సిన్నర్స్‌)
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ నటి – జెస్సీ బక్లీ (హామ్నెట్)
ఉత్తమ దర్శకుడు – పాల్ థామస్ ఆండర్సన్ (వన్ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)
ఉత్తమ సహాయ నటుడు – సీన్‌ పెన్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌)
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సహాయ నటి – ఎమీ మాడిగన్‌ (వెపన్స్‌)
ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – కెపాప్‌ డిమాన్‌ హంటర్స్‌
ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ది గర్ల్‌ హు క్రైడ్‌ పెరల్స్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – ఫ్రాంకెన్‌స్టైయిన్‌
ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ – ఫ్రాంకెన్‌స్టైయిన్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ క్యాస్టింగ్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ – ది సింగర్స్‌, టూ పీపుల్‌ ఎక్ఛ్సేంజ్‌ సలైవా
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – సిన్నర్స్‌
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ – మిస్టర్‌. నోబడీ ఎగనెస్ట్‌ పుతిన్‌
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ – ఆల్‌ ది ఎంప్టీ రూమ్స్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సౌండ్‌ – ఎఫ్‌ 1
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఎడిటింగ్‌ – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ సినిమాటోగ్రఫీ- సిన్నర్స్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ – అవ‌తార్ ఫైర్ అండ్ యాష్‌
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ – సెంటిమెంటల్‌ వ్యాల్యూ (నార్వే)
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ – గోల్డెన్‌ (కెపాప్‌ డెమోన్‌ హంటర్స్‌)
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే – వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్‌ అనదర్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ – సిన్నర్స్‌
ఆస్కార్ అవార్డ్స్: ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ – ఫ్రాంకెన్‌స్టైయిన్‌

Leave a Reply