Shekar master | క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారా.?

Shekar master | క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నారా.?
Shekar master | శేఖర్ మాస్టర్ దర్శకుడిగా ఎంట్రీ
స్వయంకృషితో టాప్ డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగిన శేఖర్
ప్రభుదేవా కొడుకు రిషిల్ రాఘవేంద్ర హీరోగా పరిచయం
మ్యూజిక్, డ్యాన్స్‌తో ప్రేమకథగా సినిమా
స్టార్ హీరోలకు శేఖర్ మాస్టర్ డైరెక్షన్ టెన్షన్?
Shekar master | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్ లో టాప్ డ్యాన్స్ మాస్టర్ అంటే.. ఇప్పుడు అందరూ చెప్పే పేరు శేఖర్ మాస్టర్. ఇంకా చెప్పాలంటే.. ఆయన సౌత్ ఇండియాలోనే టాప్ డ్యాన్స్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ డ్యాన్స్ మాస్టర్ దర్శకుడిగా మారబోతున్నాడట. ఫస్ట్ మూవీకి క్రేజీ ప్రాజెక్ట్ నే ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి..? ఇందులో నటించే హీరో ఎవరు..?
Shekar master | స్వయంకృషితో..

శేఖర్ మాస్టర్ స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. స్టార్ హీరోలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించి స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా డ్యాన్స్ ఎలా ఉండాలో అలా డిజైన్ చేస్తుంటాడు. అందుకనే.. స్టార్ హీరోల్లో ఎక్కువ మంది కొరొయోగ్రాఫర్ అంటే.. శేఖర్ మాస్టర్ కావాలంటారు. ఓ వైపు సినిమాలకు వర్క్ చేస్తూనే మరో వైపు బుల్లితెర పై రియాల్టీ షోల్లో జడ్జిగా పాల్గొంటూ జనాలకు మరింత దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కూడా శేఖర్ మాస్టరే కావడం విశేషం.
Shekar master | ప్రభుదేవా కొడుకు హీరోగా..

ఇప్పుడు శేఖర్ మాస్టర్ డైరెక్టర్ గా మారబోతున్నాడని తెలిసింది. ఇంతకీ.. హీరో ఎవరంటే.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్రను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ మాస్టర్ ఈ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. రిషిల్ కోసం శేఖర్ మాస్టర్ ఓ కథ రాసుకున్నారట. ఇటీవల ప్రభుదేవాని కలిసి కథ చెప్పారని తెలిసింది.

ఈ కథ ప్రేమికుడు తరహాలో మ్యూజిక్, డ్యాన్స్ కలిసిన ఓ ప్రేమకథ అని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట. మే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. శేఖర్ మాస్టర్ చాలా మంది స్టార్ హీరోలకు ట్యూన్ అయ్యారు. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా బిజీ అయితే.. స్టార్ హీరోలు మరో కొరియోగ్రాఫర్ ని చూసుకోవాలి. ఈ విధంగా స్టార్ హీరోలకు టెన్షనే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అది మేటరు.
