మైహోం పరిశ్రమకు ఎక్సలెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ అవార్డ్

మేళ్ళచెరువు, ఆంధ్రప్రభ ; మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోం సిమెంట్ వర్క్స్ యూనిట్- 4 ఎక్సలెంట్ ఎనర్జీ మేనేజ్మెంట్ కేటగిరీలో గోల్డ్ అవార్డు సాధించింది. తక్కువ విద్యుత్ వినియోగించిన సంస్థలకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డును గ్రీన్టెక్ ఫౌండేషన్ అందజేసింది. న్యూఢిల్లీలో జరిగిన గ్రీన్టెక్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎక్సలెన్స్ అవార్డ్ 2026 కార్యక్రమంలో ఈ అవార్డును మైహోం కంపెనీ ప్రతినిధులు జి.సుధాకర్ బాబు, ఎస్.ప్రకాష్ లు అందుకున్నారు.
విద్యుత్ పొదుపు, కార్బన్ ఉద్గారాల తగ్గింపులో యూనిట్ చేపట్టిన వినూత్న చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ ఎన్. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అవార్డు సాధించిన మైహోం టీమ్ మెంబర్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ గోల్డ్ అవార్డు మన యూనిట్ సమిష్టి కృషికి, ఇంధన సామర్థ్యం పట్ల మన నిబద్ధతకు దక్కిన గౌరవం అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను అధిగమిద్దాం అని పిలుపునిచ్చారు.
