Highway | 10మంది దుర్మరణం

Highway |10మంది దుర్మరణం

Highway | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మ్యాజిక్ వ్యాన్‌, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

లఖింపూర్ నుంచి ఇసానగర్ వైపు వెళ్తున్న మ్యాజిక్ వ్యాన్‌ను అతివేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ధాటికి వ్యాన్ పూర్తిగా ధ్వంసమైంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply