ఖానాపూర్ అభివృద్ధికి నిధుల జల్లు..
ఉట్నూర్లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషితో బీటీ రోడ్ల మంజూరు
ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కృషితో నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో పీఆర్ హ్యామ్ ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాలకు బీటీ రోడ్ల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడటంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఉట్నూర్ ఐబీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇటీవల రైతు భరోసా కింద ఎకరాకు రూ.6,000 చొప్పున నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడం సంతోషకరమని తెలిపారు.
ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గంలో అనేక బీటీ రోడ్లకు మంజూరులు రావడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
