తిరుపతి – ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 92,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం ఏపీపీఎస్సీ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. అయితే, ఓ నవవధువు తలపై జీలకర్ర బెల్లంతో పరీక్షలకు హాజరుకావడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన నమితకు ఆదివారం తెల్లవారుజామున వివాహమైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Group 2 | తలపై జీలకర్ర బెల్లం – పరీక్ష రాసిన నవవధువు
