దొన్పాల్‌లో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన..

ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

మోర్తాడ్, ఆంధ్రప్రభ: మోర్తాడ్ మండలంలోని దొన్పాల్ గ్రామంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు నిర్వహించిన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు, హోమాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారికి పూజలు సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని పెద్దమ్మతల్లిని ప్రార్థించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన వేముల ప్రశాంత్ రెడ్డి.. గ్రామ దేవతల ఆలయాలు ప్రజల విశ్వాసానికి, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తాయని, దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.