డీఆర్‌డీఓ విజయలక్ష్మికి ఘన సన్మానం
కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రం కడెంలోని రైతు వేదికలో ఇటీవల ప్రభుత్వ అవార్డు అందుకున్న నిర్మల్ డీఆర్‌డీఓ విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. కడెం మండలం ఐకేపీ ఏపీఎం జి. గంగాధర్ ఆధ్వర్యంలో ఐకేపీ సీసీలు, ఉద్యోగులు, సిబ్బంది కలిసి ఆమెకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు మల్యాల స్వామి, జాడి నరసయ్య, విష్ణువర్ధన్, జాడి పద్మజ, జ్యోతి తదితరులు, ఐకేపీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
