పెద్ది రమేష్ సేవలు అనితరసాద్యం..

పెద్ది రమేష్ సేవలు అనితరసాద్యం..
పోలీసు అధికారులు..
భవానిపురం, ఆంధ్రప్రభ : శ్రీ మీనాక్షి కన్స్ట్రాక్షన్స్ అధినేత పెద్ది రమేష్ సేవలు అనితరసాద్యమని పలువురు పోలీసు అధికారులు కొనియాడారు. వేసవిలో ప్రతిఏడాది విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 30 నుండి 40 చోట్ల రమేష్ చాలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆయనకే సాధ్యమైన పనని వారు పెద్ది రమేష్ సేవలు మెచ్చుకొన్నారు. గురువారం సామారంగం చౌక్ లో పెద్ది రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలివేంద్రాన్ని వెస్ట్ జోన్ శాంతి భద్రతల విభాగం ఏ సి పి.దుర్గారావు లాంఛనంగా ప్రారంభించారు.
అలాగే వెస్ట్ జోన్ ట్రాఫిక్ ఏ సి పి రామచంద్రరావు రథం సెంటర్ లో పెద్ది రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాలివేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే కొత్తపేట పోలీసు స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మరో చాలివేంద్రాన్ని కొత్తపేట సి ఐ సిహెచ్ చిన కొండలరావు ప్రారంభించారుఐతే ఈ మూడు చోట్లా పోలీసు అధికారులు పెద్ది రమేష్ దాహార్తుల కోసం చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటుగా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
