ఎస్‌టీఎఫ్ బృందాల విస్తృత తనిఖీలు
నెల్లూరు, ఆంధ్రప్రభ: ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో రాత్రి వేళల్లో అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎస్‌టీఎఫ్ ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై (డ్రంక్ అండ్ డ్రైవ్), బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై, వాహనాల తనిఖీలు, లాడ్జీల తనిఖీలు, అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు.
నగరంలో శాంతిభద్రతలు పరిరక్షించడం, నేరాలను నియంత్రించడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే ఈ ప్రత్యేక తనిఖీల లక్ష్యమని పోలీసులు తెలిపారు. ఇలాంటి తనిఖీలు జిల్లాలో నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
