ఆదిత్యుని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్

అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న న్యాయమూర్తి

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి ఆశీర్వదించారు. అనంతరం పట్టువస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాన్ని న్యాయమూర్తికి అందించి సత్కరించారు.