Hasanparthy | ఆంధ్రప్రభ కథనాలు.. అక్షర సత్యాలు

Hasanparthy | ఆంధ్రప్రభ కథనాలు.. అక్షర సత్యాలు

  • జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ డైరెక్టర్ అనిల్ రెడ్డి

Hasanparthy | హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ : ఆంధ్రప్రభ కథనాలు.. అక్షర సత్యాలుగా విరాజిల్లుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నదని వంగపాహడ్ వ్యవసాయ సహకార సంఘ మాజీ చైర్మన్ మేరుగు రాజేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం జీడబ్ల్యూఎంసీ రెండవ డివిజన్, వంగపాహడులో స్థానిక విలేఖరి వేల్పుల ఓదేలు ఆధ్వర్యంలో 2026 ఆంధ్రప్రభ క్యాలెండర్ ను మేరుగు రాజేష్ గౌడ్ తోపాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ పోలం అనిల్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజలకు, అధికారులకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నదని అన్నారు. దశబ్దాల కాలంగా ఆంధ్రప్రభ పత్రిక.. విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ కీలకపాత్ర పోషిస్తున్నదని కొనియాడారు. పత్రికలు సమాజానికి అద్దం పడతాయని, ఆంధ్రప్రభ నిష్పక్షపాత వార్తలతో ప్రజలకు చేరువకావడం సంతోషకరమని పేర్కొన్నారు.

నిఖార్సైన వార్తలు రాస్తూ ప్రజల మన్ననలను పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. 1938 నుంచి స్వాతంత్రోద్యమ కాలంలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు నేటి వరకు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేయడం చరిత్రలో ఒక గొప్ప విశేషమని కొనియాడారు. పోలం అనిల్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలా అనుగుణంగా వెబ్,స్మార్ట్ ఎడిషన్, డీజిటల్ తో తాజా వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ పత్రికా రంగంలో ముందు వరుసలో దూసుకువెళ్తున్నదని అన్నారు. ప్రస్తుత సమాజంలోని ఎన్నో మానవీయ కథనాలు ప్రచురిస్తూ ప్రజల తరపున కృషి చేస్తున్నదని కొనియాడారు.రెండు తెలుగు రాష్ర్టాలలో నిజాలను వెలికి తీస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం గర్వకాణమని పేర్కొన్నారు. ప్రస్తుత 2026 సంవత్సరంలో సైతం ఆంధ్రఫ్రభ మంచి కథనాలు, ప్రజా సమస్యలను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వెలుగులోకి తీసుకరావాలని కోరారు.

Leave a Reply