కడెం పోలీస్స్టేషన్లో హరితహారం కార్యక్రమం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి: ఎస్ఐ సాయి కిరణ్
కడెం (ఆంధ్రప్రభ): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కడెం పోలీస్స్టేషన్ ఎస్ఐ పి. సాయి కిరణ్, పెద్దూరు–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్ అన్నారు. గురువారం కడెం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సాయి కిరణ్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క జీవకోటికి ఎంతో ఉపయోగపడుతుందని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ దీకొండ విజయకుమార్, ఉపసర్పంచ్ పిట్టల రాజన్న, మహిళా కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ భవాని, బీఎల్వో నేరెళ్ల గంగమణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
