తోపుదుర్తి అరెస్టు

అడ్డుకున్న కార్యకర్తలు
భారీగా తరలివచ్చిన జనం
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ :
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం శ్రీనగర్ కాలనీలో ఆయనను పోలీసులు భారీ బందోబస్తు నడుమ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు రెండు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు సంపాదించారని, నాలుగు పదవులను అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదన కొనసాగిందని ఆరోపించారు. దీనిపై ఎం ఎస్‌. రాజు తీవ్రస్థాయిలో స్పందించడమే కాకుండా పత్రికల్లో రాయలేని విధంగా దూషించారు. అదేవిధంగా తన ఆస్తులను నిరూపించాలని రాజు డిమాండ్ చేశారు.

గురువారం సాయంత్రం వరకు ఈ విషయాన్ని తేల్చాలని ఆయన అల్టిమేట్0 జారీ చేశారు. ప్రకాష్ రెడ్డి నివాసానికి వెళ్తానని రాజు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరును ఆయన ఖండించడమే కాకుండా రోడ్డు మీదకు రావడంతో ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.